సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నైపాలెం గ్రామంలో తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ రాత్రి పది గంటల సమయంలో జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తెరాస రెబల్ అభ్యర్థి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. యుద్ధం చిన్న చిన్నగా వాట్సప్ గ్రూపులో అసభ్యకరమైన మెసేజ్ వరకు వెళ్ళింది. రాత్రి మద్యం మత్తులో బానోత్ రాము అనే వ్యక్తి గొడ్డలి తీసుకుని మాలోత్ వీరన్న ఇంటి మీదికి వెళ్లి దాడిచేయగా అతని తలకు గాయమైంది. అతన్ని ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఎస్సై సమక్షంలోనే మరోసారి దాడి జరిగిందని బాధితులు చెబుతున్నారు. మాకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు.
తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ - trs
సూర్యాపేట జిల్లా చెన్నైపాలెం గ్రామంలో తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ