సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తాను తెరాసను, కాంగ్రెస్ను, భాజపాను ఓడించేందుకు ఎన్నికల బరిలో దిగలేదని... 70 ఏళ్లుగా ఓడిపోతున్న తమ ప్రాంత ప్రజలను గెలిపించేందుకు పోటీ చేస్తున్నానని తెలిపారు. తాను గెలిస్తే... నియోజకవర్గంలో ఉన్న 85శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సోదరుల తరఫున పోరాటం చేస్తానని మల్లన్న పేర్కొన్నారు. హుజూర్ నగర్ ప్రజలంతా... తమ మల్లన్న టీం ఇంటికి వస్తే... అన్నం పెట్టి ఆదరించాలని కోరారు. మీ ఓటు కావాలి, నోటు కావాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశాడు.
'ప్రజలారా... మీ ఓటు కావాలి, నోటు కావాలి'
తాను హుజూర్నగర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. హుజూర్ నగర్ ప్రజలారా...మా మల్లన్న టీంకు మీ ఓటు కావాలి, నోటు కావాలి అంటూ వ్యాఖ్యానించారు.
'ప్రజలారా... మీ ఓటు కావాలి, నోటు కావాలి'
TAGGED:
తీన్మార్ మల్లన్న