సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ మధ్య కాలంలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరగా... కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా... చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించినట్లు స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ప్రశాంత్ తెలిపారు.
కరోనాతో తిరుమలగిరికి చెందిన వ్యక్తి మృతి
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు.
కరోనాతో తిరుమలగిరికి చెందిన వ్యక్తి మృతి
కొవిడ్ కట్టడికి స్థానికంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని... వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు.