సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు ఆందోళన జరుపుతున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్న కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్మికులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలను అరెస్టు చేయడం వల్ల స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లొస్తూ.. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పోలీస్‌ల అదుపులో ఉన్న కార్మికుల వద్దకు చేరుకున్న కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీమంత్రి వి. హనుమంతరావు వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం సత్వరమే దిగివచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలన్నారు.
సూర్యాపేటలో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - latest news of tsrtc workers arrest at suryapet district
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కార్మికులు, వామపక్ష, కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్‌నేత హనుమంతరావు సంఘీభావం తెలిపారు.
సూర్యాపేటలో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్