సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 6న వైకుంఠ ధామం ఏర్పాటు చేసేందుకు తమ కుటుంబాలకు చెందిన సమాధులను కూల్చివేశారని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు ఎస్సీలు.
'ఆ భూమి మా పెద్దల కోసం.. వైకుంఠధామం వెంటనే ఆపాలి'
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠధామం ఏర్పాటు చేసేందకు... తమ పెద్దల సమాధులను కూల్చేయడంపై ఎస్సీలు నిరసించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరిగింది.
మా పూర్వీకుల సమాధులను పునర్ నిర్మించాలి : బాధితులు
తమ భూమి తమకే కావాలని... కూల్చేసిన సమాధులను తిరిగి పునర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల జ్ఞాపకార్ధంగా సమాధులు నిర్మించుకున్నామని.. అలాంటి మా స్థలంలో వైకుంఠధామం నిర్మించొద్దని గట్టిగా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : నేడు తెరాస అభ్యర్థులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్