ఫార్ బాయిల్డ్ మిల్లు నుంచి వెలువడిన వ్యర్థాల వల్ల చేపలు మృత్యువాత పడ్డాయని మిల్లు ఎదుట మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఓ ఫార్ బాయిల్డ్ మిల్ నుంచి వచ్చే రసాయనాలు సమీపంలోని వెలమకుంట చెరువులో కలపడంతో సమారు పది టన్నుల చేపలు మృతి చెందాయని ముదిరాజులు వాపోయారు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మిల్లు వ్యర్థాల వల్ల పది టన్నుల చేపలు మృత్యువాత
సూర్యాపేట జిల్లా తొండ గ్రామంలోని ఫార్ బాయిల్డ్ మిల్లు వ్యర్థాలను చెరువులో వదలడం పల్ల పది టన్నుల చేపలు మృత్యువాత పడినట్లు ముదిరాజులు వాపోయారు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిల్లు ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నిసార్లు చెప్పినా మిల్లు యజమాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మిల్లు వ్యర్థాలతో చేపలు మృత్యువాత, మిల్లు ఎదుట ముదిరాజుల ధర్నా
మిల్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి వ్యర్థాలను సుమారు 67 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెలమకుంట చెరువులో కలుపుతున్నారని తెలిపారు. చేపల పెంపకానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. మిల్లు యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఆందోళనలో తొండ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు వెంకన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వారాంతపు లాక్‌డౌనా..? కర్ఫ్యూ వేళల పొడగింపా..?: హైకోర్టు