సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్లిదండ గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, శతాధిక వృద్ధురాలు పోటు కాంతమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు.
కాంతమ్మ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. లింగగిరి, మునగాల, పరగణాలో మహిళలను చైతన్యపరిచి.. ఉద్యమంలో భాగస్వాములను చేశారు. గుల్బర్గా జైల్లో ఉండి కూడా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తుల్లో ఈమె ఒకరు. ఈమె కుమారుడు పోటు సూర్యం న్యూడెమోక్రసీ పార్టీలో జనరల్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు.