సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని కంటైన్మెంట్ ప్రాంతాలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు పరిశీలించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హెల్త్ అసిస్టెంట్ ఉపేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
'ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'
కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు కోరారు.
సూర్యాపేటలో వైద్యాధికారి పర్యటన
అనంతరం కంటైన్మెంట్ ప్రాంతంలో నిర్వహిస్తోన్న ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. ఎవరికైనా అస్వస్థతకు గురైతే మెడికల్ ఆఫీసర్‌కు తెలపాలని సిబ్బందికి సూచించారు.