రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సుస్థిరాభివృద్ధి జరుగుతుందని సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. వ్యవసాయ, మత్స్య సహకార, పశుసంవర్ధక, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష జరిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో 300 మందితో ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సుస్థిరాభివృద్ధి: కలెక్టర్ - suryapeta district news
రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేస్తోందని సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించి సభ్యులుగా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
suryapeta collector
రైతుల్లో అవగాహన కల్పించి శాఖల వారీగా సభ్యులను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. డీఏవో జ్యోతిర్మయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ జగదీశ్ చంద్రబోస్, రైబస జిల్లా సమన్వయకర్త రజాక్, వేణుమనోహర్, ఎస్వీ ప్రసాద్, శ్రీధర్, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.