ఉగ్రరూపం చూపిస్తున్న భానుడు - BHANUDU
ఖమ్మం జిల్లాలో వరుసగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండతీవ్రతతో ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.
ఉగ్రరూపం చూపిస్తున్న భానుడుఉగ్రరూపం చూపిస్తున్న భానుడు
ఖమ్మం జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరుసగా 43, 44, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయాల్లో బయటికి రావాలంటే భయపడిపోతున్నారు.