సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి బ్రిడ్జిని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. వంతెన నిర్మాణాన్ని 50 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేసినా... కొంతమంది నాయకులు శిలాఫలకాలపై తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు.
ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదు: ఉత్తమ్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎంపీల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి బ్రిడ్జిని ఉత్తమ్ సందర్శించారు.
టోల్ టాక్స్ లేకుండా బ్రిడ్జిని నిర్మించామని.. ప్రజలు ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రయాణం చేసేలా చేసిన తనను బ్రిడ్జి ప్రారంభోత్సవానికి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టపల్లి బ్రిడ్జి నిర్మాణం వల్ల రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎంపీల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. అనంతరం గుర్రంపోడు తండాను సందర్శించిన ఉత్తమ్... తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి:మనింటి 'జిలేబీ' మనసారా చేసుకోండిలా...