తెలంగాణ

telangana

ETV Bharat / state

'నవ మాసాలు మోస్తే.. నడిరోడ్డుపై వదిలేశారు' - suryapet district latest news

నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ.. ఇప్పుడు వారికి భారమైంది. బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లికి.. వృద్ధాప్యంలో ఆలనాపాలనా కరువైంది. ఓవైపు విరిగిన కాలు నరకం చూపిస్తున్నా.. వైద్య ఖర్చులకు భయపడి తనను రోడ్డుపైనే వదిలేసిన కసాయి బిడ్డల చర్య ఆ మాతృమూర్తిని మరింత వేదనకు గురి చేస్తోంది.

'నవ మాసాలు మోస్తే.. నడిరోడ్డుపై వదిలేశారు'
'నవ మాసాలు మోస్తే.. నడిరోడ్డుపై వదిలేశారు'

By

Published : May 29, 2021, 7:23 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అళ్వాలపురం గ్రామానికి చెందిన భూతం శాంతమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భర్త చనిపోయినప్పటి నుంచి శాంతమ్మ ఆలనా పాలనా కొంతకాలం కుమారులు, కొంతకాలం కూతుళ్లు చూసుకుంటున్నారు. గత కొంతకాలంగా శాంతమ్మ కూతుళ్ల వద్దే ఉంటోంది.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శాంతమ్మను గేదె పొడవడంతో కాలు విరిగింది. ఆసుపత్రుల ఖర్చు తమపై పడుతుందేమోనని భావించిన కూతుళ్లు.. తల్లిని కుమారుల వద్ద వదిలివెళ్లారు. కూతురి ఇంటి వద్ద ఉండగా కాలు విరిగింది కాబట్టి వారే ఆసుపత్రి ఖర్చులు భరించాలంటూ కుమారులు శాంతమ్మను నడిరోడ్డుపై వదిలేశారు. ఆస్తులు పంచుకున్నారు కాబట్టి కొడుకులే ఆసుపత్రిలో చూపించాలంటూ కూతుళ్లూ పట్టించుకోవడం లేదు.

ఫలితంగా దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ శాంతమ్మ రోడ్డుపైనే కూర్చుంది. కాలు విరిగిన బాధను దిగమింగుకుని.. గుక్కెడు మంచినీళ్లు ఇచ్చేవారి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. వృద్ధాప్యంలో తల్లి బాగోగులు చూడాల్సిన కుమారులు, కుమార్తెలు ఆమెను నడిరోడ్డుపై వదిలేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష వాయిదా

ABOUT THE AUTHOR

...view details