సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెంలోని చర్చిలో పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టారు ఎస్ఐ వెంకన్న. గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. చర్చి పునర్నిర్మాణం కోసం పాస్టర్‌తో సహా ఏడుగురు వ్యక్తులు ఇక్కడ పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో అధికారులు వచ్చి చర్చి నిర్మాణం ఆపివేయాలని చెప్పారు.
వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టిన ఎస్ఐ - సూర్యాపేట జిల్లా వార్తలు
చర్చిలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ వెంకన్న విచక్షణా రహితంగా కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో చోటుచేసుకుంది. గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని చర్చి పాస్టర్ డిమాండ్ చేశారు.
వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టిన ఎస్ఐ
నిన్న రాత్రి రాంబాబు అనే వ్యక్తి భోజనం చేస్తుండగా ఎస్ఐ వచ్చి కొట్టాడని పాస్టర్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. ఎస్సైపై చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం