సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాను కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. మత పెద్దలు, వక్ఫ్ బోర్డు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొన్నారు.
జాన్పహాడ్ సైదన్న సన్నిథిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్పహాడ్ దర్గాను కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జాన్పహాడ్ అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో జాన్పహాడ్ అభివృద్ధి చేశానని.. నేరేడుచర్ల, పాలకీడు మండలాల అభివృద్ధి అప్పుడే జరిగిందని ఉత్తమ్ అన్నారు. నేరేడుచర్ల, పాలకీడు, జాన్పహాడ్ రోడ్డు నిర్మాణ పనులు తానే అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. హిందూ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా జాన్పహాడ్ సైదన్న నిలిచాడన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కుమారుని వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించిన సీపీ అంజనీకుమార్