తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న మద్యం పట్టివేత - సూర్యాపేట జిల్లా కోదాడ తాజా వార్తలు

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు సినీ ఫక్కీలో మద్యాన్ని తరలిస్తున్నారు. ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్న కారణంగా రోజుకో విధంగా సరిహద్దులను దాటిస్తున్నారు. తాజాగా తెలంగాణ నుంచి తవుడు బస్తాల మాటున మద్యంను తీసుకెళ్తూ దొరికిపోయారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Seizure of liquor moving to Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న మద్యం పట్టివేత

By

Published : Aug 12, 2020, 8:01 PM IST

ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న మద్యం పట్టివేత

ఆంధ్రప్రదేశ్​లో మద్యం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో కొందరు ఇదే అదునుగా సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ మార్గాల్లో తెలంగాణ నుంచి మద్యాన్ని తరలిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సాలార్జంగ్​పేట వద్ద తవుడు బస్తాల మధ్య రూ.1,34,800 విలువ చేసే మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఆంధ్రాలో అధిక ధరకు మద్యం అమ్మాలనే ఆశతో పలువురు మద్యంను సరిహద్దులు దాటిస్తున్నారు.

మద్యం తరలిస్తున్న డీసీఎం, 1,150 మందు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గిరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తవుడు బస్తాల కింద మద్యం బస్తాలు పెట్టి తరలిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో శనక్కయల కింద సుమారు 2 లక్షల విలువైన మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ చూడండి :ప్రముఖ గాయని పేరిట చాటింగ్ చేస్తూ... రూ.1.75 కోట్లు స్వాహా

ABOUT THE AUTHOR

...view details