సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇసుకను మోటు పడవల ద్వారా నదిలో నుంచి తీసుకువచ్చి ఒడ్డున డంపింగ్ చేసి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. కృష్ణానది పరివాహక పరిధిలోని చెన్నాయిపాలెం, మట్టపల్లి ప్రాంతాల్లో ఇసుకను డంపింగ్ చేసి రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ల ద్వారానే ఇసుక రవాణా చేయడం గమనార్హం. పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇలా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నదిలో ఇసుకను కూడా వదలట్లేదు...
సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో అక్రమార్కులు కృష్ణానదిలో నుంచి నాటు పడవల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. గ్రామపంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్లలోనే ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఎటువంటి రుసుము లేకుండానే ట్రాక్టర్ల ద్వారా ఇసుక అమ్మి వేలకు వేలు సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి, గ్రామపంచాయతీ ట్రాక్టర్లు గ్రామంలో ఉన్న వీధులను శుభ్రం చేయకుండా ఇసుకను రవాణా చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోతుందని అంటున్నారు. కనీసం గ్రామ పంచాయతీకి పన్ను కూడా కట్టడం లేదని.. ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: మాతృభాషలో బోధన విద్యార్థులకు ఉపయోగకరం: గవర్నర్