రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో జాతీయ రహదారి నుంచి పట్టణంలోకి వచ్చే రోడ్డు మార్గాన్ని జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆదేశాల మేరకు మూసివేశారు. ఈ ప్రాoతంలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఉన్న ఈ ఓపెనింగ్ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ రోడ్డుమార్గం మూసివేత - road accidents
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రమాదాలకు కారణమవుతున్న ఓ రోడ్డు మార్గాన్ని మూసివేశారు. హైదరాబాద్ వైపు నుంచి పట్టణంలోకి వెళ్లే జాతీయ రహదారి ఓపెనింగ్ వద్ద పలు ప్రమాదాలు జరగడం వల్ల స్పందించిన పోలీసులు ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ రోడ్డుమార్గం మూసివేత
ఈ విషయాన్ని స్థానిక పోలీసులు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థకు లేఖ ద్వారా వివరించారు. ప్రయాణీకుల రక్షణ కోసం తీసుకున్న ఈ చర్యలకు ప్రజలు సహరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మార్గానికి బదులుగా జనగామ 'ఎక్స్' రోడ్ నుంచి పట్టణంలోకి రాకపోకలు సాగించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'సర్పంచ్‌పై దాడి హేయమైన చర్య'