తెలంగాణ

telangana

ETV Bharat / state

Ratha Saptami Celebrations In Thimmapuram : రాష్ట్రంలోని తొలి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు

Ratha Saptami Celebrations In Thimmapuram : సూర్య జయంతి సందర్భంగా సూర్యభగవానుడి దేవాలయ్యాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని తొలి సూర్యదేవాలయంగా చెప్పుకునే సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Ratha Saptami Celebrations In Thimmapuram
Ratha Saptami Celebrations In Thimmapuram

By

Published : Feb 8, 2022, 3:34 PM IST

Ratha Saptami Celebrations In Thimmapuram : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో కొలువైన సూర్యభగవానుడి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రథసప్తమి పర్వదినం పురష్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రాతఃకాల సమయంలోనే సూర్యకిరణాలు గర్భలయాన్ని, స్వామివారి పాదాలను తాకాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు.

రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్​ రెడ్డి

స్వామివారిని దర్శించుకున్న మంత్రి జగదీశ్​ రెడ్డి

రథసప్తమి సందర్భంగా మంత్రి జగదీశ్​రెడ్డి సూర్యభగవానుడి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

స్వామివారి కల్యాణం

రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం సూర్యనారాయణ వ్రతం, ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి కల్యాణం జరపనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి :మురిసిపోతున్న ముచ్చింతల్.. అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details