సూర్యాపేట జిల్లా నాగారం మండలం తేరబోయినగూడెం, డి.కొత్తపల్లి గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు వీఆర్వోలు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ధర్నాకు దిగారు. జిల్లా కలెక్టర్ పాస్ పుస్తకాలు ఇవ్వమని చెప్పినా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీంతో రైతుబంధు డబ్బులు రావడంలేదని వాపోయారు. రెవిన్యూ సిబ్బంది ఇలానే వ్యవహరిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని రైతన్నలు హెచ్చరించారు.
పాస్ పుస్తకాల కోసం రైతన్నల ఆందోళన - delay
సంవత్సరం గడుస్తున్న పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రైతులను రెవెన్యూ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని కర్షకులు ఆందోళనకు దిగారు. రైతుబంధు డబ్బులు రాక నష్టపోతున్నామని వాపోయారు.
రైతన్నల ఆందోళన