దుమ్ము, ధూళి, రసాయన, వ్యర్థాలు విడుదల చేసే పరిశ్రమలు మాకొద్దని స్థానికులు అంటున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. స్థానికులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామస్థులు టెంట్లు, మండపం ధ్వంసం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం రసాయన పరిశ్రమలు నిర్మిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామంలో జువారి సిమెంట్, మైలాన్ రాకింగ్ కెమికల్ ఫ్యాక్టరీల వలన భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయన్నారు. ఈ ఫ్యాక్టరీల వల్ల వాయు కాలుష్యం ఏర్పడి గ్రామంలో ప్రాణాలు హరించుకుపోతున్నాయని పేర్కొన్నారు. దొండపాడు గ్రామంలో సర్వే నెంబర్ 290లో ప్రభుత్వ భూములు ఎస్ఆర్ఆర్, ఎస్జీఆర్ రసాయనాలు తయారు చేసే పరిశ్రమ నిర్మాణం కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని జరగనీయమని దొండపాడు పరిసర గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రసాయన పరిశ్రమలు వొద్దని గ్రామస్థుల నిరసన - సూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. స్థానికులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పరిశ్రమలు మాకొద్దని గ్రామస్థుల నిరసన