సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి అయిదు రోజుల పాటు కన్నుల పండువగా జాతర జరగనుంది. జాతరలో ప్రధాన అంకమైన దేవరపెట్టెను సూర్యాపేట మండలం కేసారం నుంచి యాదవ భక్తులు, పూజారులు, హక్కుదార్లు పెద్దగట్టుకు తరలించారు. గొర్ల గన్నారెడ్డి ఇంటి వద్ద బోనం బియ్యం, పట్టువస్త్రాలను మంత్రి జగదీశ్‌రెడ్డి ఎత్తుకుని సౌడమ్మపెట్టే ఉన్న చోటుకు వచ్చారు. అక్కడ కంకణాలు కట్టుకుని సుమారు 8కిలోమీటర్ల దూరంలోని పెద్దగట్టుకు చేరుకున్నారు. దేవతామూర్తులతో నిండిన దేవరపెట్టె గట్టుకు చేరుకోగానే... పెట్టెను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. రేపు లింగమంతులస్వామికి బోనాలు, చోడమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారు. జాతరకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.
వాహనాల మళ్లింపు..