పెద్దగట్టే పెద్దదిక్కు - యాదవ
యాదవుల ఆరాధ్య దైవంగా భావించే లింగమంతుల స్వామి కొలువుతీరిన గొల్లగట్టుకు భక్తుల రాక మొదలైంది. ఓ లింగ.. ఓ లింగ అంటూ దైవ స్మరణలో మునిగిపోయారు.
సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలో దేవరపెట్టెకు నైవేద్యం సమర్పణతో అధికారికంగా జాతర మొదలవుతుంది. భక్తులు కొండపై ఉన్న లింగమంతుల స్వామి, చౌడమ్మ దేవీలను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేసవి ప్రభావం పెరిగినందున గుట్టపై చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అత్యవసర సేవలు అందిస్తున్నారు.
ఇదీ చదవండిదాసరి తర్వాత ఆయనే..