తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థిని అనుమానస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి: ఉత్తమ్ - ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాకు చెందిన విద్యార్థిని మృతి పట్ల సమగ్ర విచారణ జరిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

pcc presiedent utham kumar reddy demands to investigati on student death in peeklanayak thanda
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

By

Published : Nov 5, 2020, 8:01 AM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాకు చెందిన గిరిజన విద్యార్థిని మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయం జరిగే వరకు కోటేశ్వరి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details