భావి తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించాలంటే... నాటిన మొక్కలని సంరక్షించాలని జాజిరెడ్డి గూడెం ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో పల్లెప్రకృతి వనంలో భాగంగా హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఎంపీపీతో కలిసి పలువురు మొక్కలు నాటారు.
'భావి తరాల కోసం మొక్కలు సంరక్షించాలి' - హరితహారం
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం రామన్న గూడెంలో పల్లెప్రకృతి వనం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీపీ మన్నె రేణుక మొక్కలు నాటారు. వాటిని సంరక్షించాలని కోరారు.
'భావి తరాల కోసం మొక్కలు సంరక్షించాలి'
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమావత్ పీరమ్మ, ఉపసర్పంచ్ వాక సుధాకర్, మండల రైతుసంఘ అధ్యక్షుడు అనీరెడ్డి, తెరాస నాయకుడు భీముడు, ఏపీఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఈసారి భారీగా దిగుబడులు... కొనుగోళ్లు ఎలా?