తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు బోల్తా... 108 నిర్లక్ష్యంతో ఒకరి మృతి - one dead

హైదరాబాద్​ నుంచి విజయవాడకు బంధువుల వివాహానికి వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 108 అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురంలో ఈ ప్రమాదం జరిగింది.

కారు బోల్తా.. 108 నిర్లక్ష్యంతో ఒకరి మృతి

By

Published : Jun 12, 2019, 3:16 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్న ఏపీ 09 ఎంయు 3237 నెంబరు గల కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఆంజనేయులు కొద్దిసేపటి వరకు ప్రాణాలతో ఉన్నా 108 అంబులెన్సులో డీజిల్​ లేకపోవడం వల్ల సమయానికి ఆస్పత్రికి తీసుకురాలేక చనిపోయినట్లు గాయపడిన వారు బాధపడుతూ చెప్పారు. పోలీసు సిబ్బంది క్షతగ్రాత్రులను ఆటోలో తరలించినట్లు సమాచారం.

కారు బోల్తా.. 108 నిర్లక్ష్యంతో ఒకరి మృతి

ABOUT THE AUTHOR

...view details