తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజకీయ కక్షతో తమ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు' - ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

ఎమ్మెల్యే ఆదేశాల మేరకే.. మున్సిపల్​ అధికారులు తమ నాయకుడి ఇంటిని కూల్చి వేశారంటూ సూర్యాపేట జిల్లా .. కోదాడలోని భాజపా శ్రేణులు ఆరోపించారు. గుర్రంబోడు ఘటనలో గిరిజనులకు మద్దతు తెలియజేసినందుకే.. తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

On the orders of the mla municipal officials demolished the house of their leader bjp activists alleged
'రాజకీయ కక్షతో తమ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు'

By

Published : Feb 15, 2021, 7:17 PM IST

రాజకీయ కక్షతో తమ నాయకుడి ఇంటిని కూల్చి వేశారంటూ సూర్యాపేట జిల్లా కోదాడలో భాజపా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆదేశాల మేరకే, జైల్లో ఉన్న భాజపా నేత వేలంగి రాజు ఇంటిని అధికారులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ.. కోదాడ మున్సిపాలిటీ ఎదుట వారు నిరసన చేపట్టారు. గిరిజనులకు మద్దతు తెలియజేసినందుకే.. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

గుర్రంబోడు ఘటనలో అరెస్టై, చర్లపల్లి జైల్లో ఉన్న వేలంగి రాజు.. తన నివాసాన్ని మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ఆ కారణంతోనే ఇంటిని​ కూల్చివేసినట్లు కమిషనర్ మల్లారెడ్డి వివరించారు.

ఇదీ చదవండి:గుర్రంబోడు తండా వివాదాస్పద భూముల వెనుక కథేంటంటే?

ABOUT THE AUTHOR

...view details