ఒ లింగా.... ఓ లింగా.... - distipuja
రెండేళ్లకోసారి యాదవులు ప్రతిష్ఠాత్మకంగా జరిపే దురాజ్‌పల్లి జాతరకు వేళయింది. ఇందుకు 15 రోజుల ముందు నిర్వహించే దిష్టి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.
పెద్దగట్టులో దిష్టిపూజ
కుమ్మరి ఇంటి నుంచి తీసుకొచ్చిన రెండు కొత్త కుండల్లో బోనం వండి నైవేద్యంగా... బూడిద పట్నంలో రెండు రాశులుగా పోశారు . ఇందులో దిష్టి కుంభాలను ఏర్పాటు చేసి దీపారాధన అనంతరం మొక్కులు చెల్లించారు. బై కండ్లు దేవుని చరిత్రకు సంబంధించి కథలు పాటలు పాడుకుంటూ ఆలయ పూజారులు హక్కుదారులకు బొట్టు బోనం అప్పగించారు. మెంత బోయిన, మున్నా వారు వండిన రెండు బోనాలను పెరుగుతో కలిపి చౌడమ్మ ఎదుట ఉంచారు. తర్వాత ఆలయప్రాంగణంలో బలి ముద్ద చల్లడంతో దిష్టి పూజ పరిపూర్ణమవుతుంది.
33 మంది దేవతలు కొలువై ఉన్న దేవరపెట్టె కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి ఎదురు చూశారు. ఈ క్రమంలో జాతర ప్రాంగణానికి చేరుకోగానే పెద్ద ఎత్తున ఓ లింగ నామస్మరణంతో గట్టు ప్రాంగణం మారు మోగింది. చౌడమ్మను తాకడంతో పాటు దేవర పెట్టే కింది నుంచి ఈగితే పుణ్యం లభిస్తుందని వారి నమ్మకం. దేవరపెట్టెను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు.