సూర్యాపేట జిల్లా కోదాడలో మే డే సందర్భంగా ఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి... 500 మంది పారిశుద్ధ్య, వైద్య ఆరోగ్య సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి అండగా నిలిచారని కొనియాడారు. లాక్డౌన్ తర్వాత కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ
ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది తమ సేవలతో అండగా నిలిచారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 500మంది సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు.
సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ
రేపటి నుంచి తెల్లరేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 ఖాతాలో జమ అవుతాయని మంత్రి తెలిపారు. లాక్డౌన్ అమలులో ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ ఛైర్పర్సన్ వనపర్తి శిరీష పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ