సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ సమీపంలో కింద మూసీ నదికి అడ్డుగా నాగార్జునసాగర్ ఎడమకాలువను నిర్మించారు. ప్రస్తుతం నిండుగా ప్రవహిస్తున్న సాగర్ ఎడమ కాలువ, భారీ వరదలతో దిగువన కృష్ట నదిలో కలిసేందుకు బిరబిరా పరుగులు తీస్తున్న మూసీ నది కనువిందు చేస్తోంది. పై నుంచి సాగర్ నీరు, కింది నుంచి మూసీ నది ప్రవహిస్తూ.. నాటి ఇంజనీర్ల నైపుణ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
ముగ్ధ మనోహరం: మూసీ మురిపిస్తోంది.. కృష్ణా కనువిందు చేస్తోంది... - నాగార్జునసాగర్ వార్తలు
ప్రపంచంలోనే రాతితో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా నాగార్జునసాగర్ జలాశయం ప్రసిద్ధి పొందింది. అనంతగరి కొండల్లో పుట్టిన మూసీ వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. కానీ సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ సమీపంలో కింద మూసీ నది పైన నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రవాహిస్తూ కనువిందు చేస్తోంది.
ముగ్ధ మనోహరం: మూసీ మురిపిస్తోంది.. కృష్ణా కనువిందు చేస్తోంది...
పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న వరదలతో గేట్లు ఎత్తేశారు. ఈ ప్రభావంతో మూసీ నదిలో నీటి ప్రవాహాం అధికంగా ఉంది. ఒకవైపు నేలను పరుచుకున్నట్లు విశాలంగా ప్రవహిస్తున్న మూసీ నీరు, నిండుకుండను తలపిస్తున్న సాగర్ ఎడమ కాలువ నీరు చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి:రకుల్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో హైదరాబాద్‌కు లింకులు: సంపత్‌కుమార్