సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 9 ఎంపీటీసీలు స్థానాలు ఉండగా ఐదు తెరాస, నాలుగు కాంగ్రెస్ గెలుచుకుంది. ఎంపీపీ కోసం తెరాసకు చెందిన ఇద్దరు పోటీ పడ్డారు. అందులో గింజుపల్లి రమేశ్‌ను పార్టీ పెద్దలు మండల అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించారు. మరో వ్యక్తి చుండూరి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మద్దతుతో తెరాస రెబల్‌గా పోటీ చేస్తున్నారు. చివరి నిమిషంలో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు.
ఎంపీటీసీల పరుగు ఎందుకో తెలుసా! - elections
సూర్యాపేట జిల్లా అనంతగిరి ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మండల అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరికి పార్టీ మద్దతు ఉంటే మరొకరి కాంగ్రెస్ మద్దతు లభించింది.
పరుగులు పెడుతున్న ఎంపీటీసీలు