సూర్యాపేటలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహా విష్కరణ కార్యక్రమానికి తనను పిలవకపోవడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎంపీగా తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన ఎంపీ డబ్బు, అధికారం శాశ్వతం కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం సర్కార్‌కు లేదా అని ప్రశ్నించిన ఆయన ఉన్నత చదువులు చదివిన మంత్రి కేటీఆర్ ఒక్కసారి రాజ్యాంగాన్ని కూడా చదవాలని సూచించారు.
రాజ్యాంగానికి సీఎం కేసీఆర్ విలువనివ్వడం లేదు: ఎంపీ వెంకటరెడ్డి - mp komatireddy venkat reddy latest news
ప్రభుత్వ కార్యక్రమాలను తెరాస నేతలు పార్టీ కార్యక్రమాల్లాగే నిర్వహిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను పిలవకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉన్నత చదువులు చదివిన మంత్రి కేటీఆర్ ఒక్కసారి రాజ్యాంగాన్ని కూడా చదవాలని ఎంపీ సూచించారు.
తెరాస తీరును తప్పుబట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రభుత్వ కార్యక్రమాలను కూడా తెరాస నేతలు పార్టీ సమావేశాల్లాగే నిర్వహిస్తోందని ఎంపీ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎక్కడ ప్రశ్నిస్తారోనని ప్రతిపక్ష పార్టీల నాయకులను కేటీఆర్ ఆహ్వానించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇంకా గడీల పాలన సాగిస్తున్న కేసీఆర్ రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవించాలని సూచించారు.
ఇదీ చదవండి:Etela: తెరాస పునాదులు ఎవరూ పెకిలించలేరు : వినయ భాస్కర్