తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేత

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. వారిలో మనో ధైర్యాన్ని నింపారు.

MLA Gadri Kishore Kumar donates to corona-affected journalists in suryapet district
MLA Gadri Kishore Kumar donates to corona-affected journalists in suryapet district

By

Published : Jun 6, 2021, 8:47 PM IST

సూర్యాపేట జిల్లాలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్, నాగారం, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలకు చెందిన 11 మంది జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు అందజేశారు.

వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని.. వారిలో మనోధైర్యాన్ని నింపారు. కరోనాతో పోరాటంలో జర్నలిస్టులు ముందు వరసలో ఉన్నారని వెల్లడించారు. ఈ కరోనా విపత్కర సమయంలో అండగా ఉంటూ.. ఎమ్మెల్యే సహకారం అందుకున్న 21 మంది జర్నలిస్టులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: ఒక్క రోజు వ్యవధిలో కరోనా కాటుకు భార్యాభర్తలు బలి

ABOUT THE AUTHOR

...view details