ప్రజలు తెరాస వైపే ఉన్నారని... భాజపావి బూటకపు మాటలని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని కల్లోలాలు సృష్టించాలని భాజపా నేతలు చూస్తున్నారని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో ఒక్క సీటు గెలవగానే సంబర పడిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎల్‌ఆర్‌ఎస్, ధరణి పోర్టల్‌తో అవినీతిని రూపుమాపాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
భాజపావి బూటకపు మాటలు: తలసాని
సూర్యాపేట జిల్లా ఆకుపాముల గ్రామంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. భాజపావి బూటకపు మాటలని ఆయన ఆరోపించారు. పేదలకు, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
talasani
పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని తలసాని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయో ప్రజలకు తెలుసునని అన్నారు. భాజపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.25వేలు బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సత్యవతి