సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పర్యటించారు. ఎన్.అన్నారం చెరువులో ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలను విడిచిపెట్టారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే అనేక రంగాలు చతికిలపడ్డాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయానికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. సుమారు 361 చెరువుల్లో చేపపిల్లలను విడిచి పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
'వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం' - minister jagadesh reddy
సూర్యాపేట జిల్లా ఎన్.అన్నారం చెరువులో రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేప పిల్లలను విడిచిపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలను పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
'వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం'