సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో సుమారు ఆరువేల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
హరితహారం అందరి బాధ్యత... సంరక్షణ సామాజిక బాధ్యత: మంత్రి - హరితహారం కార్యక్రమ వార్తలు
భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులు, స్వచ్ఛమైన గాలి అందించేందుకే ముఖ్యమంత్రి ఈ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి నేరేడుచెర్ల మండలం పెంచికల్ దిన్నే గ్రామంలో ఆయన హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
'గ్రామాలకు నిధులు ఇచ్చి చెట్లు పెంచేది మన ప్రభుత్వమే'
కేసీఆర్ దూరదృష్టి సంకల్పమే ఈ హరితహారమని మంత్రి పేర్కొన్నారు. మనిషి మనుగడ సాధించేందుకు స్వచ్ఛమైన గాలి కావాలంటే... భూమి మీద 33% అడవులు ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి చెట్ల పెంపునకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామంలో చెట్లను సంరక్షించే బాధ్యత కేవలం ప్రజాప్రతినిధులదే కాదని... గ్రామంలోని ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుందని తెలిపారు.
ఇవీ చూడండి:ట్రాయ్ కొత్త యాప్‌తో ఛానెళ్ల ఎంపిక ఈజీ!