తన సొంత నియోజకవర్గం సూర్యాపేటలోని చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి 5.8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు పడక గదుల గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఏకకాలంలో అందరు లబ్దిదారుల చేత గృహ ప్రవేశం చేయించారు . అనంతరం జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చి , ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే తెలంగాణా రాష్ట్రం ఆగ్ర భాగాన ఉన్నదని అన్నారు. ముఖ్యమంత్రి సంకల్పం మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద వారికి రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు.
రెండు పడక గదుల గృహ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్న ఘనత కేవలం తెరాస పార్టీకే దక్కుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి గ్రామంలో 5.8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 80 రెండు పడకల గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చామని తెలిపారు .
తిరుమలగిరి గ్రామంలో గత ఎనిమిది ఏళ్ల క్రితమే ఇప్పుడు ఇళ్లు కట్టిన ప్రదేశంలో రెండు పడక గదుల సముదాయాన్ని నిర్మించాలని తలచామని, అనుకున్నట్లుగానే ఈ రోజు పేదలకు ఇళ్లను అందించామని తెలిపారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, అన్నీ రకాల మౌలిక వసతులతో కూడిన గృహాలను నిర్మించి ఇచ్చామని వెల్లడించారు, పేద ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి అన్నారు. లబ్దిదారులు వారికి వచ్చిన ఇంటి ఆవరణాలో విధిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్య సభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్