విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం - Man Dies with current shock
సూర్యాపేట జిల్లా యాతవాకిళ్ల గ్రామంలో నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇవి తగిలి షేక్ కాసులు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామానికి చెందిన షేక్ కాసులు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందారు. రాత్రి సమయంలో గ్రామంలో వీచిన ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. ఏదో జరిగిందని బయటకు వచ్చి చూడగానే కింద పడ్డ వైరు కాలుకు తగిలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కుటుంబంలో యాజమాని మృతి చెందటం వల్ల విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.