పెద్దలు నిరాకరించారని పోలీసుల సమక్షంలో ఒక్కటైంది ఓ ప్రేమజంట. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓ ఆకుల సందీప్, చీర భవ్య గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ ఇష్టంలేని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు.
పెద్దలు నిరాకరిస్తే.. పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట! - తెలంగాణ వార్తలు
ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పెద్దలు అందుకు నిరాకరించారు. చేసేది లేక పోలీసులనాశ్రయించారు. పోలీసు స్టేషన్లో ఒక్కటయ్యారు.
పోలీసు స్టేషన్లో ప్రేమికుల పెళ్లి, ప్రేమికుల పెళ్లి చేసిన పోలీసులు
ఇద్దరూ మేజర్లు కావడంతో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మద్దిరాల పోలీసులను సంప్రదించారు. ఇరువురి తల్లిదండ్రులకు ఎస్సై బండి సాయి ప్రశాంత్ నచ్చజెప్పారు. పోలీసుల చొరవతో పెద్దల సమక్షంలో ఆ ప్రేమ జంట ఒక్కటైంది.
ఇదీ చదవండి:అమ్మయ్యాక కూడా ఇలా అందంగా మెరిసిపోదాం!