సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో మద్యం దుకాణం నుంచి విచ్చలవిడిగా బెల్టుషాపులకు మద్యం తరులుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుకాణాల్లో మద్యం నిలువలు అయిపోతున్నాయంటూ... ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముతున్నారన్నారు. ఉదయం నుంచి లక్ష రూపాయలకు పైగా మద్యం బెల్టుషాపులకు తరలించినట్లు సమాచారం.
విచ్చలవిడిగా బెల్టుషాపులకు తరలుతున్న మద్యం - beit shops in villages
చాలా రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరవగా... మందుబాబులు బారులు తీరుతున్నారు. దుకాణాల్లో మద్యం నిలువలు నిండుకుంటే తమదే రాజ్యమని భావిస్తున్న బెల్టుషాపు నిర్వాహకులు జాగ్రత్తపడుతున్నారు. లక్షల సరుకును విచ్చలవిడిగా తరలిస్తున్నారు.
విచ్చలవిడిగా బెల్టుషాపులకు తరులుతున్న మద్యం
మరోవైపు మద్యం దుకాణాల ముందు మందుబాబులు భౌతిక దూరం పాటించటం లేదు. మాస్కులు ధరించటం లేదు. ఇవేవీ పట్టించుకోకుండా వ్యాపారులు మద్యం అమ్ముతున్నారు. అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు.