కోదాడలో ఘనంగా కార్మిక దినోత్సవం - bollam mallayya
కోదాడలో మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి పలు ప్రాంతాల్లో జెండాను ఎగురవేశారు.
బైక్ ర్యాలీ
సూర్యాపేట జిల్లా కోదాడలో మే డే దినోత్సవాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ఖమ్మం క్రాస్‌రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్లలో జెండాను ఎమ్మెల్యే ఎగరవేశారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీని నిర్వహించింది.