సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాంధీనగర్ ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు. రంజాన్.. సోదరత్వం, మతసామరస్యతకు సూచికని మంత్రి కొనియాడారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేర్పుతుందని వివరించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు.
'మతసామరస్యానికి సూచిక రంజాన్' - JAGADEESH REDDY
సోదరత్వం, మతసామరస్యతకు సూచిక రంజాన్ పర్వదినమని మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
'మతసామరస్యతకు సూచిక రంజాన్'