తెలంగాణ

telangana

ETV Bharat / state

అది హుజూర్​నగర్ కాదు.. గుంతలనగర్ - ేీజూ

హుజూర్​నగర్ కాస్తా గుంతలనగర్​గా మారిందని పట్ణణంలోని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఉన్న రోడ్లకు కనీసం మరమ్మత్తులు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడుతున్నారు.

గుంతలనగర్

By

Published : Aug 11, 2019, 1:47 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో మిషన్ భగీరథ పైపులైన్లు పట్టణ వాసులకు ఇబ్బందికరంగా మారాయి. పట్టణం మొత్తం గుంతల మయంగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఎక్కడ పనులు అక్కడే అసంపూర్తిగా వదిలివేసి వెళ్తున్నారని ఆరోపించారు. వర్షం వచ్చినప్పుడు రోడ్లపై పయనించాలంటే జారిపడే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి చాలామంది జారిపడ్డారని ఒకానొక సందర్భంలో కాళ్లు, చేతులు విరిగే పరిస్థితి ఏర్పడుతోందని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న రోడ్లకు కనీసం మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు హుజూర్​నగర్ పట్టణంలోని కాలనీలకు వచ్చిన జాడే లేదని ఆరోపించారు. హుజూర్​నగర్​ను గుంతలనగర్​గా నామకరణం చేయ్యొచ్చని ఎద్దేవా చేశారు.

హుజూర్​నగర్ కాదు.. గుంతలనగర్

ABOUT THE AUTHOR

...view details