హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధే తప్ప... గత ఆరేళ్లలో నియోజకవర్గాన్ని అధికార పార్టీ ఏనాడూ పట్టించుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి పేర్కొన్నారు. ఇప్పుడు తెరాస నేతలు మాయమాటలు చెబుతూ... ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఎత్తిపోతల పథకాలు, రహదారులతోపాటు... ప్రతి పల్లెలోనూ అభివృద్ధి పనులు చేసిన ఘనత తమదని ఆమె చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే... రాష్ట్రంలో పార్టీ బలం పుంజుకుంటుందంటున్న పద్మావతితో ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
ఉత్తమ్ అభివృద్ధే గెలిపిస్తుంది: పద్మావతి - huzurnagar by election latest news
హుజూర్నగర్ నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విస్మరించిన అంశాలే తమ ప్రచార అస్త్రాలని వెల్లడించారు. ఉపఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తమ్ అభివృద్ధే గెలిపిస్తుంది: పద్మావతి