తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ్ హుజూర్​నగర్​పై పట్టు నిలుపుకునేనా? - BY ELECTIONS

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో నువ్వానేనా అనే విధంగా రసవత్తర పోరు సాగుతోంది. అన్ని పార్టీల నేతలు గెలుపుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా సిట్టింగ్​ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్​ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎట్టకేలకు ఉత్తమ్​ పద్మావతి రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు.

హుజూర్​నగర్​  ఉత్తమ్​కు దక్కేనా..!

By

Published : Sep 24, 2019, 8:49 PM IST

హుజూర్​నగర్​ ఉత్తమ్​కు దక్కేనా..!

హుజూర్​నగర్ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​... తెరాస ఎన్ని ఎత్తులువేసినా... కారుకు దారిలేదంటూ విజయంపై ధీమాతో ఉన్నారు. ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై హస్తం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి... చామల కిరణ్ కుమార్​ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన చేసి కొంత గందరగోళానికి తెరతీశారు. రంగంలోకి దిగిన అధిష్ఠానం చివరకు ఉత్తమ్​ పద్మావతి పేరును ఖరారు చేసింది. పద్మావతి రెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పేర్కొంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ ఇవాళ లేఖ విడుదల చేశారు.

స్వల్ప తేడాతో ఓటమి

2014లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మావతి రెడ్డి... 2018లోను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్​నగర్​ ఉత్తమ్‌ సిట్టింగ్‌ స్థానం. ఆ ప్రాంతంపై ఉత్తమ్‌ కుటుంబానికి గట్టి పట్టు ఉంది. అధికార తెరాస అభ్యర్థి సైదిరెడ్డి గతంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోడానికి తెరాస పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. కాంగ్రెస్‌ కోటలో పాగా వేయాలని తెరాస చూస్తోంది. పద్మావతి రెడ్డి అయితే దీటైన పోటీ ఇవ్వడమే కాకుండా... గెలుపు తథ్యమన్న భావన కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఇవీ చూడండి:హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ఇం​ఛార్జీగా పల్లా రాజేశ్వర్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details