హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జోరుగా సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలవరకు 13.44 శాతం ఓటింగ్ కాగా.. పదకొండు గంటల్లోపు 31.34 శాతం నమోదైంది. భాజపా అభ్యర్థి కోట రామారావు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. మొత్తం 79 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు... ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రజలు చరవాణీలు తీసుకెళ్లకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
హుజూర్నగర్లో కొనసాగుతున్న పోలింగ్ - huzurnagar assembly election results 2019
హుజూర్నగర్ ఉపఎన్నిక తుది దశకు చేరుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది.
హుజూర్నగర్ ఉపఎన్నికలు- 2019 మధ్యాహ్నం ఒంటిగంటవరకు 52.89 శాతం పోలింగ్