ప్రభుత్వం లాక్డౌన్ విధించి 12 రోజులైనందున.. పనులు లేక ఇంటి వద్దనే ఉంటూ లాక్డౌన్ పాటిస్తున్న దినసరి కూలీలకు హిజ్రాలు ఆహార పొట్లాలు అందజేసి తమ ఉదారతను సేవా గుణాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని జంగాలగూడెంలో నివాసం ఉంటున్న 30 నిరుపేద కుటుంబాలకు ఆహార పొట్లాలతో పాటుగా, శుద్ధజలాన్ని వారు అందజేశారు. ప్రజలు స్వీయదూరం పాటించాలని, ఎవరూ బయటకు రాకుండా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని వారు కోరారు.
నిరుపేదలకు అండగా తామున్నామన్న హిజ్రాలు - ఆహార పొట్లాల పంపిణీ
వారిని అందరూ వింతగా చూస్తూ అవహేళన చేస్తారు. కానీ తమకు మనసుందని.. తాము తోటివారికి సాయపడగలమని హిజ్రాలు ముందుకొచ్చారు. సూర్యాపేట జిల్లాలోని 30 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీచేసి తమ సేవాగుణాన్ని చాటిచెప్పారు.
నిరుపేదలకు అండగా తామున్నామన్న హిజ్రాలు