సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని తాడ్వాయి, గణపవరం చెరువులు అలుగులు పోయడం వల్ల రహదారి పైనుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తాడ్వాయి-వెంకట్రాంపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాధవరం నుంచి వస్తున్న వరద నీరుతో తాడ్వాయి రహదారి కోతకు గురైంది.
జిల్లాలో విస్తారంగా వర్షాలు.. అలుగులు పోస్తున్న చెరువులు
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారి పైనుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలో విస్తారంగా వర్షాలు.. అలుగులు పోస్తున్న చెరువులు
నడిగూడెం మండలంలోని చాకిరాల-శ్రీరంగపురం మధ్య పైనుంచి వచ్చే వరద కారణంగా కాల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. కాల్వర్టు మరమ్మత్తులు చేయాలని స్థానిక యువకులు అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన వ్యక్తంచేశారు. మోతె మండలంలోని ఉర్లుగొండ సమీపంలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మునగాల, నడిగూడెం, మండలాల్లో వరిపంట నీటమునగగా, మోతె మండలంలో పత్తి, మిరప, కంది పంటలకు నష్టం వాటిల్లింది.