అధికారుల ప్రణాళిక లోపంతో రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా ధాన్యం వాహనాలు నిలిచి ఉన్నాయి. జనగామ జిల్లా నుంచి ధాన్యం లోడుతో వచ్చిన వాహనాలు సుమారు వందకు పైనే ఉన్నాయి. మిల్లు లోపల స్థలం లేకపోవడంతో దిగుమతులు ఆలస్యమవుతున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు, రైతులు, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
'అధికారుల ప్రణాళిక లోపం.. రైతులకు తప్పని తిప్పలు'
అధికారుల ప్రణాళిక లోపంతో రైతులు, లారీ డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిల్లులకు తీసుకొచ్చిన ధాన్యాన్ని రోజులు గడిచినా దిగుమతి చేసుకోవడం లేదు. ఏ జిల్లాలో సేకరించిన ధాన్యం అదే జిల్లాలోని మిల్లులకు తరలిస్తే పెద్దగా సమస్యలు ఉండేవి కావని అన్నదాతలు అంటున్నారు.
ధాన్యం కొనుగోలు సమస్యలు, రైతుల సమస్యలు
ఏ జిల్లాలో సేకరించిన ధాన్యం అదే జిల్లాలోని మిల్లులకు తరలిస్తే పెద్దగా సమస్యలు ఉండేవి కావని రైతులు అంటున్నారు. స్థానికంగా ఉన్న ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యాన్ని కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాలకు తరలిస్తూ... జనగామ నుంచి ఇక్కడి మిల్లులకు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఉండడం వల్ల వాహనదారులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:Curfew in AP: ఏపీలో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పొడిగింపు