తెలంగాణ

telangana

ETV Bharat / state

గుర్రంబోడు రైతులకు న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి - మంత్రి సత్యవతిని కలిసిన గిరిజన సంఘాల జేఏసీ నేతలు

గుర్రంబోడు తండా రైతులకు న్యాయం చేయాలని కోరుతూ గిరిజన సంఘాల జేఏసీ నేతలు.. మంత్రి సత్యవతి రాఠోడ్​ను ఆమె నివాసంలో కలిశారు. నాగార్జున సాగర్​ నిర్మాణ సమయంలో గిరిజనులకు పునరావాసం కింద ప్రభుత్వం భూములిచ్చిందని.. కానీ ఆ భూములను ఓ వ్యక్తి తన పేరున రాయించుకున్నారని మంత్రికి తెలిపారు.

minister sathyavathi rathode, girijana jac leaders
మంత్రి సత్యవతి రాఠోడ్​, గిరిజన సంఘాల జేఏసీ

By

Published : Feb 12, 2021, 12:22 PM IST

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండా రైతులకు న్యాయం చేయాలని.. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ను గిరిజన సంఘాల జేఏసీ నేతలు కోరారు. మంత్రిని హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గిరిజనులకు పునరావాసం కింద ప్రభుత్వం భూములిచ్చిందని నేతలు పేర్కొన్నారు. ఆ భూములను ఓ వ్యక్తి తన పేరున రాయించుకుని మోసం చేశారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

గుర్రంబోడు గిరిజన రైతుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సత్యవతి హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్​

ABOUT THE AUTHOR

...view details