తెలంగాణ

telangana

ETV Bharat / state

పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - సూర్యాపేట జిల్లా వార్తలు

పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో లక్ష 14 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

flood coming to pulichinthala project in suryapeta
పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

By

Published : Aug 27, 2020, 8:42 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలో పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో లక్ష 14 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. విద్యుత్ ఉత్పాదన ద్వారా 15 వేలు, 6 గేట్ల ద్వారా 85000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 175 అడుగులు కాగా ప్రస్తుతం 174 అడుగులుగా ఉంది. వరద ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:విజయ్​ మాల్యా రివ్యూ పిటిషన్​పై సుప్రీం తీర్పు రిజర్వు

ABOUT THE AUTHOR

...view details